ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అవి రాయల కాలం నాటి విగ్రహాలు..! - ప్రకాశం జిల్లా వార్తలు

ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలంలోని ఓ రైతు పొలంలో పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అవి రాయలకాలం నాటి విగ్రహాలని చరిత్రకారులు పేర్కొంటున్నారు.

బయటపడిన రాయల కాలం నాటి విగ్రహాలు
బయటపడిన రాయల కాలం నాటి విగ్రహాలు

By

Published : Sep 6, 2021, 7:27 AM IST

ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన రావి శ్రీను అనే రైతు పొలంలో బయటపడిన పురాతన విగ్రహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైతు పొలం దున్నుతుండగా ఏడాది క్రితం రుక్మిణీదేవి, వారం రోజుల కిందట వేణుగోపాల స్వామి విగ్రహాలు బయటపడ్డాయి. వీటిని పొలం గట్టున ఉంచి రైతు పూజలు చేస్తున్నారు.

ఈ విషయం పరిసర ప్రాంత గ్రామస్థులకు తెలియడంతో.. విగ్రహాలను చూసేందుకు ఆదివారం భారీ సంఖ్యలో తరలివచ్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు పొలం వద్దకు చేరుకుని రైతును విచారించారు. అనంతరం వాటిని స్వాధీనం చేసుకున్నారు. పురావస్తు శాఖ అధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు. రుక్మిణీదేవి, వేణుగోపాల స్వామి విగ్రహాలు శ్రీకృష్ణదేవరాయల కాలానికి చెందినవని అద్దంకి పట్టణానికి చెందిన చరిత్రకారుడు చంద్రమౌళి పేర్కొన్నారు.

ఇదీ చదవండి:RAINS : రాష్ట్రాన్ని ముంచెత్తిన వానలు... నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం !

ABOUT THE AUTHOR

...view details