ప్రకాశం జిల్లా అద్దంకిలో ప్రమాదాల నివారణ ధ్యేయంగా పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. హెల్మెట్ పెట్టుకో..... గులాబీ పువ్వు అందుకో అంటూ సీఐ హైమా రావు ఆధ్వర్యంలో అద్దంకి పోలీసులు రహదారిపై హెల్మెట్ తో ప్రయాణిస్తున్న వాహనదారులకుఅభినందనలు తెలుపుతూ గులాబీ పువ్వులను అందించారు. కార్ల లో ప్రయాణించే వారికి సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచనలు చేశారు. హెల్మెట్ ధరించకపోతే, సీట్ బెల్ట్ పెట్టకోకపోతే... జరిగే అనర్ధాల గురించి ప్రయాణికులకు అవగాహన కల్పించారు. అనుకోని ప్రమాదం జరిగినా... హెల్మెట్ ధరిస్తే ఎలాంటి గాయాలు కాకుండా ఉంటాయని... సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ప్రమాదం జరిగినప్పటికీ ప్రాణాలతో బయట పడవచ్చని ప్రయాణికులకు తెలిపారు.
అద్దంకిలో పోలీసుల వినూత్న కార్యక్రమం - addanki
ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రకాశం జిల్లా అద్దంకి పోలీసులు వినూత్న కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ పెట్టుకో..... గులాబీ పువ్వు అందుకో అంటూ సీఐ హైమారావు ఆధ్వర్యంలో నిర్విహించారు.
పోలీస్