ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సినీ ఫక్కీలో కిడ్నాప్.. ఎవరు? ఎందుకు? - Prakasam

ప్రకాశం జిల్లా అద్దంకిలో ఓ వ్యక్తి రోడ్డు పక్కన నిల్చుని ఉండగా... సినీ ఫక్కీలో నలుగురు వ్యక్తులు కారులోంచి దిగారు. ఒక్కసారిగా ఆవ్యక్తిని చుట్టుముట్టారు. బలవంతగా కారులో ఎక్కించుకొని వెళ్లిపోయారు. ఇంతకీ.. వాళ్లెవరు? ఎందుకు కిడ్నాప్ చేశారు? బాధితుడి పరిస్థితేంటి?

సినీఫక్కీలో వ్యక్తి కిడ్నాప్

By

Published : Jul 5, 2019, 7:45 AM IST

సినీఫక్కీలో వ్యక్తి కిడ్నాప్

ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో ఓ వ్యక్తి కిడ్నాప్ కలకలం రేపింది. అందరూ చూస్తుండగానే.... సినిమా ఫక్కీలో నలుగురు వ్యక్తులు వచ్చి ఓవ్యక్తిపై దాడి చేశారు. కారులో బలవంతంగా ఎక్కించుకెళ్లారు. సదరు బాధితుడు భయంతో కేకలు వేసినా ఎవరూ పట్టించుకోలేదు. ''ఎవరైనా పోలీసులకు ఫోన్ చేయండి.. నన్ను కాపాడండి'' అంటూ బతిమలాడినా ఎలాంటి ఫలితం లేకపోయింది. దుండగులు అతడిపై దాడి చేస్తూ తీసుకెళ్తున్నా భయంతో ఎవరూ అడ్డు చెప్పలేకపోయారు. అసలు కారులో వచ్చిందెవరు ? ఆవ్యక్తిని ఎందుకు బలవంతంగా తీసుకెళ్లారు? ఇరు వర్గాల మధ్య వివాదం ఏంటి? అనే విషయం తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details