ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యక్తి అనుమానాస్పద మృతి.. కొనసాగుతున్న విచారణ - పాలేరు

గ్రామంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకుని పరిస్థితిని గమనించిన పోలీసులు జాగిలాలతో విచారణ ప్రారంభించారు. హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

వ్యక్తి మృతదేహం లభ్యం.. జాగిలాలతో పోలీసుల దర్యాప్తు

By

Published : Jul 22, 2019, 3:45 PM IST

వ్యక్తి మృతదేహం లభ్యం.. జాగిలాలతో పోలీసుల దర్యాప్తు

ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేరులో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పాలేరులో వంతెన కింద మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతన్ని కనిగిరి మండలం లింగారెడ్డిపల్లెకి చెందిన పత్తి ప్రసాద్​గా పోలీసులు గుర్తించారు. అతని ఒంటిపై గాయాలుండడం, పక్కనే ఉన్న బండరాళ్లకి రక్తం అంటుకుని ఉండటంతో.. హత్యకు గురయ్యాడా అనే అనుమానంతో జాగిలాల సాయంతో దర్యాప్తు చేస్తున్నారు. నిన్న ఇదే గ్రామంలో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. రెండు రోజుల వ్యవధిలో రెండు మరణాలు జరగడం గ్రామస్తులను భయాందోళనకు గురి చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details