Gundlakamma River: ప్రకాశం జిల్లా కురిచేడు మండలం ముషట్లగంగవరం వద్ద గుండ్లకమ్మ నది ఉద్ధృతంగా ప్రవహించటంతో వంతెన అప్రోచ్ రోడ్డు కోతకు గురైంది. 10గ్రామాల ప్రజలు ఐకమత్యంతో వంతెన, అప్రోచ్ రోడ్డులను నిర్మించుకున్నారు. ఇది కురిచేడు, త్రిపురాంతకం మండలాలను కలుపుతుంది. వంతెన వద్ద అప్రోచ్ రోడ్డు గుండ్లకమ్మ ఉద్ధృతికి కోతకు గురై రాకపోకలు అంతరాయం ఏర్పడింది.
ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ నదిపై తెగిపోయిన ఆప్రోచ్ రోడ్డు - గుండ్లకమ్మ నది
Gundlakamma River: ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ నదికి గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద ప్రవహం పెరిగింది. దీంతో ముషట్లగంగవరం వద్ద వంతెన అప్రోచ్ రోడ్డు తెగిపోయింది. ఈ వంతెన, ఆప్రోచ్ రోడ్డులను ఆ చూట్టు పక్కల గ్రామాల ప్రజలు కలిసి నిర్మించుకున్నారు.
Etv Bharat
"పది గ్రామాల ప్రజలం కలిసి నదిపై వంతెన, రోడ్డు నిర్మించుకున్నాము. గత మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నది ప్రవహాం పెరగటంతో అప్రోచ్ రోడ్డు తెగిపోయింది. అప్రోచ్ రోడ్డు తెగిపోవటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వం, అధికారులు, ప్రభుత్వం పట్టించుకొని బాగు చేస్తే బాగుంటుంది". -ఆది శేషు, గ్రామస్థుడు
ఇవీ చదవండి: