BRIDGE: ప్రకాశం జిల్లా కురుచేడు మండలం ముష్టగంగవరానికి సమీపంలో..గుండ్లకమ్మ నది ప్రవహిస్తోంది. నదికి ఇటు కురుచేడు, దర్శి, దొనకొండ మండలాలు.. అటు త్రిపురాంతకం, పుల్లలచెరువు, ఎర్రగొండపాలెం మండలాలు ఉన్నాయి. దాదాపు 20 గ్రామాల ప్రజలు.. ఏదో ఒక పనిపై నిత్యం అటుఇటూ తిరుగుతూ ఉంటారు. (BRIDGE)మధ్యలో నది ఉండటం వల్ల.. రాకపోకలకు కష్టంగా ఉండేది. (people constructing the bridge) వర్షాకాలం వస్తే కష్టాలన్నీ ఇన్నీకావు. బల్లకట్టుపై ప్రయాణం ప్రమాదకరంగా ఉండటం.. నిర్వాహకులు అధిక మొత్తంలో డబ్బు వసూలు చేయడం వల్ల.. ఇబ్బందులు తప్పేవికావు. చుట్టూతిరిగి వెళ్ళాలంటే.. సుమారు 50 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వచ్చేది.
BRIDGE: ఇది ప్రజలు నిర్మించుకుంటున్న వారధి.. ఎక్కడో తెలుసా? - prakasam news
BRIDGE: వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఆ నది దాటేందుకు ప్రజలు ప్రాణాలు పణంగా పెట్టాలి. ఆరు మండలాల ప్రజలు దగ్గర దారిలో రాకపోకలు సాగించాలన్నా.. అదే మార్గం. ఏరు పారితే బల్లకట్టుపై ప్రయాణమే దిక్కు! అదీ అవసరానికి అందుబాటులో ఉంటేనే. వంతెన నిర్మించాలని ప్రజలు ఏళ్లతరబడి కోరుతున్నా.. పట్టించుకున్నవారు కరవు. ఇన్ని సమస్యల మధ్య అక్కడి ప్రజలేం చేశారో ఓసారి చూద్దాం.
గుండ్లకమ్మ మీద వంతెన నిర్మించాలని జనం ఏళ్ళుగా డిమాండ్ చేస్తున్నా.. అధికారులు సర్వేలు చేశారు తప్ప మంజూరు చేయలేదు. ఇక చేసేది లేక.. ప్రజలే వంతెన నిర్మించుకుంటున్నారు. మొదట వంతెన నిర్మించతలపెట్టిన ప్రజలు.. పొరుగుగ్రామాల ప్రజలను కలిసి సహకారం అడిగారు.(bridge in prakasam) నది మద్యలో గొట్టాలు పెట్టి కాంక్రీట్ పిల్లర్లు వేసి.. వంతెనమాదిరిగా వెడల్పాటి కాజ్‌వే నిర్మిస్తున్నారు. 5 లక్షల రూపాయలతో నడకదారిలా నిర్మించాలనుకున్న ఈ వంతెన.. వాహనాలు రాకపోకలకు తగ్గట్టుగా 20 లక్షలతో నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. స్వయంకృషితో బ్రిడ్జి నిర్మిస్తున్న తమకు.. ప్రభుత్వం సహకరించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చదవండి:
TAGGED:
ap latest news