కరోనా విషయంలో ప్రభుత్వం అసత్యాలు చెబుతోందని ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విమర్శించారు. వ్యాక్సిన్ కొనుగోలు మొదలు.. పంపిణీ, కరోనా చికిత్స, మౌలిక వసతులు ఏర్పాటు, మెడికల్ మాఫియా దందాను అరికట్టడం వరకు అన్నింటిలోనూ ఘోరంగా విఫలమైందన్నారు. తప్పిదాలను కప్పి పుచ్చుకునేందుకు అవాస్తవాలతో ప్రకటనలు ఇస్తోందన్నారు. చాలా రాష్ట్రాలు ముందు చూపుతో వివిధ కంపెనీలకు అడ్వాన్సులు చెల్లించి వ్యాక్సిన్ను కొనుగోలు చేశాయని... వైకాపా ప్రభుత్వం కాలయాపన చేసిందన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల మొదటి డోస్ వేసిన వారికి రెండో డోస్ దొరకట్లేదన్నారు.
'కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం' - parchuru mala sambhashivarao news
కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విమర్శించారు. కరోనా టెస్టింగ్ నుంచి ట్రేసింగ్ వరకు చెబుతున్నవన్నీ అబద్దాలే అని ఆరోపించారు. మెడికల్ మాఫియాను అడ్డుకోవడంతో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు.
parchuru mla sambashivarao