తెదేపా బాపట్ల పార్లమెంట్ అధ్యక్షునిగా నియమితులైన ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశిరావు ప్రమాణస్వీకారానికి భారీ ర్యాలీగా తరలివెళ్లారు. గుంటూరు జిల్లా బాపట్లలొ ప్రమాణస్వీకార మహోత్సవం చేయనున్నారు. ఉదయం 7.45 గంటలకు మార్టూరు మండలం ఇసుక దర్సిలోని ఏలూరి క్యాంప్ కార్యాలయం నుంచి తెదేపా కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీగా బాపట్లకు బయలుదేరారు. మార్గ మధ్యలో యుద్దనపూడి మండలంలోని గన్నవరం, పర్చూరు, కారంచేడుల్లో ఎన్టీఆర్, అంబెేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం చీరాల మీదుగా బాపట్లకు భారీ ర్యాలీగా వెళ్ళారు.
తెదేపా బాపట్ల పార్లమెంట్ అధ్యక్షునిగా ఏలూరి ప్రమాణ స్వీకారం.. - parchur tdp mla eluri sambasivarao latest comments
తెదేపా బాపట్ల పార్లమెంట్ అధ్యక్షునిగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశిరావు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. ఆయన మార్గ మధ్యలో ఎన్టీఆర్, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

పర్చూరు ఎమ్మెల్యే భారీ ర్యాలీ