పక్షవాతంపై... అందరికీ అవగాహన అవసరం - chirala
బీపీ, షుగర్లను అదుపులో ఉంచుకోకపోతే గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు ప్రముఖ న్యూరాలజిస్ట్, డాక్టర్ గంటా శ్రీనివాస్. ప్రకాశం జిల్లా చీరాల శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్లో పక్షవాతంపై జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
పక్షవాతం పై అవగాహన సదస్సు
ప్రకాశం జిల్లా చీరాల శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్లో పక్షవాతంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఈ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని ప్రముఖ న్యూరాలజిస్ట్, డాక్టర్ గంటా శ్రీనివాస్ సూచించారు. బీపీ, షుగర్ని నిత్యం అదుపులో ఉంచుకోవాలని అన్నారు. నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు పర్వవేక్షించారు.