ఒంగోలు జిల్లాలోని గిద్దలూరులో ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు కొందరి అక్రమార్కులకు కల్పతరువుగా మారాయి. ఒక్కో పరీక్షకు ఒక్కో రేటు చొప్పున బేరసారాలు జరిగేవి! ఈ తరుణంలో "ఈటీవీ భారత్- ఈటీవీ"ల్లో ఓపెన్ టెన్త్, ఇంటర్లో... చూచిరాతలు' పేరుతో ప్రత్యేక కథనం వచ్చింది. దీంతో అధికారులు స్పందించారు. ఇన్విజిలేటర్లను జంబ్లింగ్ పద్ధతిలో కేటాయించారు. డిపార్టమెంటల్ అధికారిని గెజిటెడ్ స్థాయిలో నియమించారు. మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఆరుగురిని డిబార్ చేశారు. ఓ గదిలో నలుగురు విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతుంటే... ఇన్విజిలేటర్ చూసీచూడనట్టు వ్యవహరించారు. దీంతో ఆ నలుగురు విద్యార్థులను డిబార్ చేసి, ఆ ఇన్విజిలేటర్‌ను విధుల నుంచి తొలగించారు. ఒక్కరోజు పకడ్బందీగా పరీక్షలు జరిగితేనే ఆరుగురు డిబార్ అయ్యారంటే... గత మూడు రోజులుగా పరీక్షలు ఎలా సాగాయో.!? ఇట్టే అర్థమవుతోంది.
"ఓపెన్ టెన్త్, ఇంటర్"లో చూచిరాతలకు చెక్ - prakasham
"ఈటీవీ భారత్" అధికారుల్లో కదలిక తీసుకొచ్చింది. 'ఓపెన్ టెన్త్, ఇంటర్లో... చూచిరాతలు' కథనంతో యంత్రాంగం కదిలింది. గిద్దలూరు కేంద్రంలో పరీక్ష పకడ్బందీగా జరిగింది. గెజిటెడ్ స్థాయి అధికారుల పర్యవేక్షణలో కొనసాగింది. ఆరుగురిని డిబార్ చేసిన అధికారులు... ఓ ఇన్విజిలేటర్‌ను విధుల నుంచి తప్పించారు.
"ఓపెన్ టెన్త్, ఇంటర్"లో చూచిరాతలకు చెక్
ఇదీ చదవండి