ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రైవేటు టీచర్లు, లెక్చరర్లను ప్రభుత్వం ఆదుకోవాలి' - యర్రగొండపాలెం ప్రైవేటు టీచర్లు

తమను ఆదుకోవాలని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ప్రైవేటు టీచర్లు. లెక్చరర్లు విజ్ఞప్తి చేశారు. లాక్​డౌన్ కారణంగా.. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

private teachers
ప్రైవేటు టీచర్లకు లాక్​డౌన్ ఇబ్బందులు

By

Published : Aug 10, 2020, 7:42 PM IST

లాక్​డౌన్​ కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రైవేటు టీచర్లను, లెక్చరర్లను ప్రభుత్వం ఆదుకోవాలని ఉపాధ్యాయులు కోరారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నెహ్రూ యువ కేంద్రం వద్ద ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ సభ్యులు సమావేశమయ్యారు.

లాక్​డౌన్ కారణంగా తమ పరిస్థితి అధ్వాన్నంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వర్గాల వారికీ సాయం చేస్తున్నట్లు.. ప్రభుత్వం తమనూ ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత 5 నెలలుగా జీతాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్టు ఆవేదన చెందారు.

ABOUT THE AUTHOR

...view details