ప్రకాశం జిల్లా కొరిశపాడు దైవాలరావూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మరో వ్యక్తి గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇద్దరూ.. స్వగ్రామమైన మేదరమెట్ల వెళ్లి వస్తుండగా ద్విచక్రవాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి... ఒకరికి గాయాలు - prakasam district latest news
ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం దైవాలరావూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా..మరొకరు గాయపడ్డారు.
ప్రమాదంలో మరణించిన యువకుడు
మృతుడు పమిడిపాడు గ్రామానికి చెందిన చిట్టేటి ప్రశాంత్‌గా గుర్తించారు. ఒక్కగానొక్క కుమారుడు మరణించటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తీవ్రంగా గాయపడిన వసంత్‌ను ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. బైక్ అదుపు తప్పిందా..? లేక ఏదైనా వాహనం ఢీకొట్టి ఉండవచ్చా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
ఇదీ చదవండి:పెళ్లి చెడగొట్టారని ఓ వ్యక్తి వీరంగం... మద్యం తాగి మహిళను చంపిన వైనం...