ప్రకాశం జిల్లాలో యర్రగొండపాలెంలో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు.. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అందులో తెలుగుదేశం పార్టీ నేతల చిత్రపటాలకూ చోటు కల్పించారు.
అయితే.. ఆ ఫ్లెక్సీలో జూనియర్ ఎన్టీఆర్ ఫొటో కింద.. ఏపీ నెక్స్ట్ సీఎం.. అని ఓ కామెంట్ కూడా ప్రింట్ చేసి ఉండడం.. చర్చనీయాంశమైంది. ఈ ఫ్లెక్సీ ఎవరు ఏర్పాటు చేశారన్న విషయమై.. పట్టణంలో జోరుగా చర్చ జరుగుతోంది.