రహదారిపై ఉపాధి హామీ మహిళా కూలీల ధర్నా - darna
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అల్లినగరం గ్రామంలో వేతనం కోసం ఉపాధి హామీ కూలీలు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
darna-on-roads
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అల్లినగరం గ్రామంలో ఉపాధి హామీ కూలీలు ఆందోళనకు దిగారు. వేతనం జమ కాలేదంటూ జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. మహిళా కూలీలు రహదారిపై బైఠాయించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ క్రమంలో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.