ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దెబ్బతిన్న పంటకు పరిహారం అందేలా కృషి చేస్తాం: ఎమ్మెల్యే నాగార్జున

నివర్ కారణంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీగా పంటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంటలు తీవ్రంగా నష్టపోతుంటే రైతులు ఆవేదన చెందుతున్నారు. కనీసం పెట్టుబడులైన చేతికి రాక అప్పుల్లో కూరుకుపోతున్నామని పలువురు రైతులు.. ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి ముందు వాపోయారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.

మార్కాపురంలో రైతులను పరామర్శించిన ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి
మార్కాపురంలో రైతులను పరామర్శించిన ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి

By

Published : Nov 29, 2020, 3:20 PM IST

మార్కాపురంలో రైతులను పరామర్శించిన ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి
నివర్ తుపాన్ ప్రభావంతో ప్రకాశం జిల్లా రైతాంగం భారీగా నష్టపోయారు. వేలకు వేలు పెట్టుబడులు పెట్టిన పంటలు వరదల్లో మునిగిపోయాయని ఆవేదన చెందుతున్నారు. మార్కాపురం నియోజక వర్గంలోని రైతులను ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి పరామర్శించారు. మండలంలోని తిప్పాయిపాలెం, మిట్టమీదపల్లి గ్రామాల్లో పూర్తిగా నష్టపోయిన మిర్చి, పత్తి, శనగ, మినుము పంటలను వ్యవసాయ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. మిర్చి కోతలు కోసి కల్లాల్లో ఆరబోసిన కాయలు పాడయ్యాయని రైతులు ఎమ్మెల్యే వద్ద వాపోయారు. కాయలతో ఉన్న చెట్లు నెలకొరిగి చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు తెలిపారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.


ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details