ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. గతంలో మృతుడు, నిందితుల మధ్య జరిగిన వివాదాలే హత్యకు కారణమని డీఎస్పీ నాగేశ్వరరెడ్డి వెల్లడించారు. మృతుడు మార్కాపురం పట్టణ పోలీసు స్టేషన్ లో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. మార్కాపురం పట్టణ పరిధిలో ఎలాంటి అల్లర్లకు పాల్పడినా... వారిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని డీఎస్పీ నాగేశ్వరరెడ్డి హెచ్చరించారు.
హత్య కేసును ఛేదించిన పోలీసులు
ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 9న జరిగిన హత్య కేసులో ఇద్దరు నిందితులు రామకృష్ణారెడ్డి, పిన్నిక శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు.
murder case accused arrest in prakasham district