ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమ్మఒడి పథకం లబ్ధిదారుల అవస్థలు - darshi mandal

అమ్మఒడి పథకాన్ని రేషన్-ఆధార్ కార్డులకు ముడిపెట్టడంతో ప్రజలు వేకువ జాము నుంచే ఆధార్ కేంద్రాలకు పోటెత్తుతున్నారు. ఒంగోలులోని దర్శి మండలంలో ప్రధాన తపాలా కార్యాలయాన్నే ఆధార్ కేంద్రంగా మార్చడంతో, చుట్టుపక్కల ఉన్న 56 గ్రామాల ప్రజల రాకతో తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు.

తపాలా కార్యాలయం వద్ద బారులు తీరిన ప్రజలు

By

Published : Aug 20, 2019, 12:44 PM IST

Updated : Aug 20, 2019, 7:35 PM IST

తపాలా కార్యాలయం వద్ద బారులు తీరిన ప్రజలు

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న అమ్మఒడి పథకాన్ని రేషన్ కార్డుతో ముడి పెట్టడంతో, ఆధార్ కేంద్రాలకు ప్రజలు పోటెత్తుతున్నారు. ఒంగోలులో ఆధార్ కేంద్రం లేకపోవడంతో ప్రధాన తపాల పాలకార్యాలయంలోనే తాత్కాలిక ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో దర్శి మండలంలో ఉన్న 56 గ్రామాల ప్రజలు ఈ పోస్టాఫిస్ కు భారీగా తరలి వస్తున్నారు. ఆధార్​కార్డులో తమ పిల్లల వేలిముద్రలను అనుసంధానం చేయించుకునేందుకు తల్లిదండ్రులు పిల్లలతో రావడంతో భారీ క్యూలైన్లలో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కొందరు వేకువ జామున నాలుగు గంటలకే పిల్లలను వెంటబెట్టుకొని వరుసలో నిలబడుతున్నారు. దీంతో రోజంతా పిల్లలతో ఆధార్ కేంద్రం వద్దే గడపాల్సి వస్తోందని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయితి పరిధిలో ఉన్న పోస్టాఫిసుల్లోనూ ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Last Updated : Aug 20, 2019, 7:35 PM IST

ABOUT THE AUTHOR

...view details