ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులను ప్రోత్సహిస్తే... మంచి ఫలితాలు సాధిస్తారని ప్రకాశంజిల్లా చిన్నగంజాం మండల విశ్రాంత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఏడుగుండ్ల నాగేశ్వరరావు అన్నారు. చిన్నగంజాం లోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రతిభ కనపరిచిన పదో తరగతి విద్యార్ధులకు నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. 14 మంది విద్యార్ధులతో పాటు.. జూనియర్ కబడ్డీ క్రీడాకారులకు 27 వేల రూపాయలు, క్రీడా దుస్తులు ఇచ్చారు.
'విద్యార్థులను ప్రోత్సహిస్తే ఉన్నతులవుతారు' - retired
ప్రకాశంజిల్లా చిన్నగంజాంలో.. ప్రతిభావంతులకు ప్రోత్సాహకాలు అందించారు. మండల విశ్రాంత రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఏడుగుండ్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.
విద్యార్థులకు ప్రోత్సాహకం ఇస్తున్న డుగుండ్ల నాగేశ్వరరావు