మంత్రులుగా బాలినేని, ఆదిమూలపు ప్రమాణస్వీకారం
ప్రకాశం జిల్లా నుంచి పార్టీ అధినేతకు అత్యంత విశ్వాసపాత్రులుగా మెలిగిన ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు లభించింది. ఒంగోలు, యర్రగొండపాలెం ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఆదిమూలపు, బాలినేని
పార్టీ ఆవిర్భావం నుంచి వైకాపా ఆదరిస్తూ వస్తున్న జిల్లాలో ప్రకాశం ఒకటి. అలాంటి జిల్లా నుంచి ఇద్దరికి మంత్రులుగా అవకాశం కల్పించారు ఆపార్టీ అధినేత జగన్. సచివాలయం వేదికగా జరిగిన ప్రమాణస్వీకార వేడుకలో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేష్ మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరితో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు.
జిల్లాలో బాలినేనిదే హవా...
పార్టీ వాదనను సమర్థంగా వినిపించి... పార్టీ పట్ల విధేయుడిగా, పార్టీ వాదనను సమర్థంగా వినిపించిన మరో ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్. వరుసగా మూడు ఎన్నికల్లో గెలుపొందారు. 2009లో యర్రగొండపాలెం నుంచి, 2014లో సంతనూతలపాడు నుంచి, 2019 ఎన్నికల్లో మళ్లీ యర్రగొండపాలెం నుంచి విజయం సాధించారు. 2014లో గెలిచిన తర్వాత జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరినా సురేష్ వెళ్లలేదు. వైకాపాకు విధేయుడిగా ఉంటూ అటు శాసనసభలోనూ, ఇటు జిల్లా సమావేశాల సందర్భంగానూ తన గళం విప్పేవారు. ఉన్నత విద్యావంతుడు కావడం ఆయనకు కలిసి వచ్చిన విషయం