ఆమంచి వ్యాఖ్యలు సిగ్గుచేటు:మంత్రి నారాయణ - chirala
చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పై మంత్రి నారాయణ మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పారదర్శక పాలన అందిస్తున్నారని ఉద్ఘాటించారు.
చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పై మంత్రి నారాయణ మండిపడ్డారు. ముఖ్యమంత్రి పారదర్శక పాలన అందిస్తున్నారని ఉద్ఘాటించారు.సీఎం చంద్రబాబుకు కుల పిచ్చి అంటూ ఆమంచి వ్యాఖ్యానించటం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రంలో పింఛన్లు అందుకుంటున్న 54 లక్షల మంది లబ్ధిదారుల్లో అన్ని కులాల వారు ఉన్నారనే విషయం ఆమంచికి తెలియదా అంటూ ప్రశ్నించారు.చీరాల నియోజకవర్గానికి ఈ నాలుగున్నర సంవత్సరాలలో ప్రభుత్వం 874 కోట్ల రూపాయలు అందించిందని, 1000 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఆమంచి కృష్ణమోహన్ నిధులు మంజూరు చేయించుకున్నారని వెల్లడించారు.పార్టీ మారే సమయంలో ఇతరులపై బురద చల్లటం సరైన పద్ధతి కాదని మంత్రి హితవు పలికారు.