ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రివర్స్ టెండరింగ్​తో రూ.60 కోట్లు ఆదా' - వెలిగొండ ప్రాజెక్టును సందర్శించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్

రాష్టంలో నీటి కొరత లేకుండా... సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని జలవనరులశాఖ మంత్రి అనిల్​కుమార్ యాదవ్ పేర్కొన్నారు.

minister anil kumar yadav about irrigation projects
minister anil kumar yadav about irrigation projects

By

Published : Nov 30, 2019, 6:54 PM IST

'రివర్స్ టెండరింగ్​తో రూ.60 కోట్లు ఆదా'

రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే... తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అనిల్​కుమార్ యాదవ్ ఉద్ఘాటించారు. ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు పనులను మంత్రులు ఆదిమూలపు సురేశ్, బాలినేని శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. ప్రాజెక్టు దగ్గర ఏర్పాటు చేసిన టన్నెల్​ పనుల ఫొటో గ్యాలరీని మంత్రులు పరిశీలించారు. అనంతరం మంత్రి అనిల్ మీడియాతో మాట్లాడారు. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులు పూర్తిచేస్తామన్నారు. రివర్స్ టెండరింగ్​కు వెళ్లి.. వెలిగొండ ప్రాజెక్టులో రూ.60 కోట్లు ఆదా చేశామని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. వచ్చే సీజన్ వరకు ఒకటో టన్నెల్ ద్వారా ప్రాజెక్టు పరిసర ప్రాంతాలకు నీరందిస్తామని మంత్రి వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details