Minister Ambati Rambabu: ఇటీవల దెబ్బతిన్న గుండ్లకమ్మ రిజర్వాయ్లను భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే సుధాకర బాబు, జిల్లా అధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో స్పిల్ వే రెగ్యులేటర్ గేట్లను పరిశీలించారు. గేట్ దెబ్బ తినడంతో జలాశయంలో నీళ్లు బయటకు పోయాయని... దాదాపు రెండు టీఎంసీల నీటిని విడిచిపెడితే గానీ స్పాట్ లాక్‌లు ఏర్పాటు చేయడం సాధ్యంకాదని మంత్రి అంబటి పేర్కొన్నారు. ఈ గేట్లేమీ నిన్న మొన్న కొట్టుకు పోలేదని... ఐదారేళ్లుగా తుప్పు పట్టి ఈ రోజు ఇలా దెబ్బ తిన్నాయన్నారు. గత ప్రభుత్వం ఏమీ చేయకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు..
ఈ ప్రోజక్ట్ కోసం గత ప్రభుత్వం రూ.5 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి అంబటి అన్నారు. ఆ డబ్బుతో డ్యాం సుందరీకరణ, గెస్ట్ హౌస్ కోసం ఖర్చు చేశారు తప్ప... మరమ్మత్తుల కోసం ఖర్చు చేయలేదని చెప్పారు. కమీషన్ కోసం ఆ నిధులు ఖర్చుచేశారని ఆరోపించారు. గుండ్లకమ్మ స్పిల్ వే రెగ్యులేటర్ గేట్లు మరమ్మతు త్వరలో ప్రారంభిస్తాని తెలిపారు. పనులు చేపట్టాలంటే 2 టీఎంసీల నీటిని సముద్రంలోకి విడిచి పెట్టక తప్పదన్నారు.
మరమ్మతులు పూర్తయ్యాకా సాగర్ నుంచి నీటిని మళ్లించి, గుండ్లకమ్మ జలాశయాన్ని నింపుతామని పేర్కొన్నారు. ఖరీఫ్‌కు నీటిని అందిస్తామని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి హామీ ఇచ్చారు.