Tiger migration in Prakasam district: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం కొలుకుల పరిసర అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తోందని.. పులి అడుగులు గుర్తించామని అటవీశాఖ అధికారులు తెలిపారు. చెరువు సమీపంలో పెద్ద పులి అడుగులను గుర్తించిన గ్రామస్థులు.. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. కొలుకుల సెక్షన్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిసి పులి తిరిగిన ప్రదేశాలను పరిశీలించారు. ఈ పరిసర ప్రాంతాల్లో పది రోజుల నుంచి సంచరిస్తుందని తమకు సమాచారం ఉందని తెలిపారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన పనిలేదని.. కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని తెలిపారు.
ప్రకాశం జిల్లాలో పెద్దపులి సంచారం.. భయాందోళనలో గ్రామస్థులు - Tiger feet
Tiger migration in Prakasam district: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం కొలుకుల పరిసర అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తోంది. చెరువు సమీపంలో పెద్ద పులి అడుగులను గుర్తించిన గ్రామస్థులు.. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన పనిలేదని.. కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని తెలిపారు.
Tiger migration in Prakasam district
నిన్నటి రోజు పెద్దపులి కొలుకుల గ్రామానికి సమీపంలో చెరువు దగ్గరకు వస్తుందని.. మాకు సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఈ రోజు మేము వెళ్లి చూశాము. పులి అడుగులు అక్కడ గుర్తించాము. గత పది రోజులుగా ఆ ప్రాంతంలో పులి తిరుగుతుంది.. ప్రజలు కూడా చీకటి పడితే బయటకు రావద్దని మనవి చేస్తున్నాము.- వెంకటేశ్వర్లు, సెక్షన్ ఆఫీసర్
ఇవీ చదంవిడి: