ప్రకాశం జిల్లా ఒంగోలు రైల్వే స్టేషన్ నుంచి వలస కార్మికుల తరలింపును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 7 జిల్లాలకు చెందిన కార్మికులను ప్రత్యేక బస్సుల్లో తీసుకువచ్చి... ప్రత్యేక రైలు ఏర్పాటు చేసి తరలించారు. ప్రకాశం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, నెల్లూరు జిల్లాల్లో చిక్కుకున్న వలస కూలీలను.. శ్రామిక్ రైలు ద్వారా వారి స్వస్థలాలకు పంపించారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన సుమారు 3,200 మంది కార్మికులు ఆయా జిల్లాల్లో వివిధ వృత్తుల్లో వున్నారు. వారి అభ్యర్థనలు మేరకు వీరిని సొంత రాష్ట్రాలకు పంపించేందకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆయా జిల్లాల్లో ఉన్నా వారిని ప్రత్యేక బస్సుల్లో ఒంగోలుకు రప్పించి, ఇక్కడ నుంచి ప్రత్యేక రైలులో వారిని తరలిస్తున్నారు. టిక్కెట్లు కూడా ప్రభుత్వమే చెల్లించి పంపిస్తోంది.