ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో రైతుల భారీ ర్యాలీలు - Farmers' rallies in protest of agricultural laws in Addanki

దిల్లీలో రైతు సంఘాలు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీకి మద్దతుగా... .ప్రకాశం జిల్లాలో అఖిలభారత రైతుసంఘం ఆధ్వర్యంలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. మార్టూరు తూర్పు బజార్ వినాయక దేవాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ 16వ నెంబరు జాతీయ రహదారి మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

ప్రకాశం జిల్లాలో రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ  రైతుల భారీ ర్యాలీలు
ప్రకాశం జిల్లాలో రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతుల భారీ ర్యాలీలు

By

Published : Jan 26, 2021, 7:02 PM IST

నెలల తరబడి దిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తుంటే కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించటం దారుణమని అఖిలభారత రైతుసంఘం నాయకులు అన్నారు. దిల్లీ రైతుల ఆందోళనలకు మద్దతుగా ప్రకాశం జిల్లా మార్టూరు, ఇంకొల్లులో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో అధిక సంఖ్యలో ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలతో అన్నదాతలు పాల్గొన్నారు. అద్దంకి పట్టణంలో వామపక్షాల ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో రాంనగర్ మార్కెట్ యార్డ్ నుంచి భవాని కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. రైతులు కార్పొరేట్ సంస్థల చేతికి చిక్కితే ఏ విధంగా ఉంటుందో అర్థమయ్యేలా నాటికను ప్రదర్శించారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన వ్యక్తం చేస్తుంటే... కేంద్రం పట్టించుకోకపోవటం శోచనీయమని అఖిలభారత రైతుసంఘం నాయకులు విమర్శించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details