ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వార్డు పర్యటనలో ఎమ్మెల్యే.. సమస్యల పరిష్కారంపై దృష్టి - tour

ప్రజలకు దగ్గరకు వెళ్లి  వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని పరిష్కరించడమే తన కర్తవ్యమని ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో రోజుకో వార్డు చొప్పున పర్యటిస్తున్నట్లు వివరించారు.

వార్డు పర్యటనలో ఎమ్మెల్యే.. సమస్యల పరిష్కారంపై దృష్టి

By

Published : Aug 6, 2019, 2:29 PM IST

ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి నియోజకవర్గంలో పర్యటించారు. రోజుకో వార్డు చొప్పున తిరిగి అక్కడి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. నేడు చెన్నరాయునిపల్లి, ఇందిరమ్మ కాలనీలకు వెళ్లి స్థానికులను అడిగి అక్కడి ఇబ్బందులను తెలుసుకున్నారు. వర్షాలు పడి మట్టిరోడ్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. తాగునీరు లేదనీ.. ట్యాంకర్లతో ఇచ్చే నీరు సరిపోవడంలేదన్నారు. ఇందిరమ్మ కాలనీలో విద్యుత్ తీగలు డాబాలపై వేలాడుతున్నాయనీ.. దాంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన నాగార్జునరెడ్డి వెంటనే సమస్యలు వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

వార్డు పర్యటనలో ఎమ్మెల్యే.. సమస్యల పరిష్కారంపై దృష్టి

ABOUT THE AUTHOR

...view details