రహదారి పనులు చేస్తున్న టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతిచెందాడని తమకు న్యాయంచేయాలని కోరుతూ ప్రకాశంజిల్లా చిన్నగంజాంలో రహదారిపై మృతదేహంతో మృతుని బంధువులు రాస్తారోకో నిర్వహించారు... పెద్దగంజాం పంచాయితీ పరిధిలోని ఆవులదొడ్డి గొల్లపాలెంకు చెందిన ఆవుల శివప్రసాద్ ద్విచక్రవాహనంపైపెద్దగంజాం నుంచి చిన్నగంజాం వెళ్తుండగా...గత రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతికి జాతీయరహదారి పనులకు ఉపయోగిస్తున్న టిప్పరే కారణమని ఆరోపిస్తూ...రహదారిపై బంధువులు ఆందోళన చేపట్టారు. దీంతో ఒంగోలు - చీరాల మద్య వాహనాలరాకపోకలు నిలిచిపోయాయి.. సంఘటనా స్దలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి...రహదారిపై బంధువుల ఆందోళన
గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా చిన్నగంజాంలో చోటుచేసుకుంది. మృతికి రహదారి పనులు చేస్తున్న టిప్పర్ కారణమని ఆరోపిస్తూ...రహదారిపై బంధువులు ఆందోళన చేపట్టారు.
రహదారిపై బంధువుల ఆందోళన