ప్రకాశం జిల్లా చీరాలలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు.గవినివారి పాలెంకు చెందిన బొయిన గంగరాజు బుధవారం పని నిమిత్తం ఇంటి నుంచి బయలుదేరాడు... రాత్రికి చీరాల సమీపంలోని ఐఎల్టీడీ సమీపంలో రైలు పట్టాల పక్కన విగతజీవిగా పడున్నాడు. స్థానికులు గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
మృతుడు గంగరాజు గతంలో తెదేపా బూత్ కమిటీ కన్వీనర్‌గా పనిచేశాడు. గంగరాజు వంటిపై గాయాలు తప్ప ఏమీ లేవు... రైలు కిందపడిఉంటే... శరీరం చిద్రమయ్యేదని... హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చీరాలలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి - prakasham
ప్రకాశం జిల్లా చీరాలలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు.
చీరాలలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ఇదీ చదవండి