ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు - mahatnma gandhi jayanthi celebrations in prakasham ongole

ప్రకాశం జిల్లాలో గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఒంగోలులోని జయంతి వేడుకల్లో మంత్రి బాలినేని పాల్గొని మహాత్ముని విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. పలుచోట్ల స్వచ్ఛ భారత్​ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ప్రకాశం జిల్లాలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

By

Published : Oct 2, 2019, 11:39 PM IST

ప్రకాశం జిల్లాలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

మహాత్మాగాంధీ ఆశయాలను స్పూర్తిగా తీసుకొని ప్రతీ ఒక్కరూ సమాజ అభివధ్ధికి కృషి చేయాలని రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు గాంధీ రోడ్డులో నిర్వహించిన గాంధీ 150 జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌, ఒంగోలు పార్లమెంట్‌ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి మహాత్మునికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాలలు గాంధీ వేషధారణతో ఆకట్టుకున్నారు.

కనిగిరిలో కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలంయంలో ప్లాస్టిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను సర్వశిక్షా అభియాన్ జిల్లా సమన్వయ కర్త కొండారెడ్డి వివరించారు. ప్లాస్టిక్ నిర్మూలనకు కృషి చేస్తామంటూ విద్యార్థులు ప్రమాణం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details