ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో గ్రామ వాలంటీర్లుగా ప్రభుత్వ అధికారులు 282 మంది నియమించారు. వారందరికీ కొలువు పొందారని ధ్రువీకరణ పత్రాలు అందించారు. యువకులు ఆనందంతో ఉద్యోగం దొరికిందని రాత్రంతా సంబరపడి తెలిసిన వారందరికీ తెలిపారు. తీరా ఉదయం శిక్షణకు వచ్చేసరికి కొలువులో మీ పేరు లేదని బయటికి పంపించేశారు. దీనితో ఆశ్చర్యపడిన పలువురు అధికారలను అడగ్గా... ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని మాట దాటేస్తున్నారు. ఉద్యోగాల్లో అవకతవకలు జరిగినందుకు అభ్యర్థులు బాధపడుతున్నారు.
వాలంటరీ ఉద్యోగాల్లో అవకతవకలు! - praksam district
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో గ్రామ వాలంటరీ ఉద్యోగాల్లో భారీగా అవకతవకలు జరిగాయని కొందరు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. తర్వాత చేరేందుకు వచ్చేసరికి వేరే వాళ్లకు అవకాశం ఇచ్చినట్టు తెలిసి ధర్నా చేశారు.
వాలంటరీ ఉద్యోగాల్లో అవకతవకలు