ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దర్శి సంక్రాంతి సంబరాలు 'కబడి పోటీల్లో' సత్తా చాటిన చినగంజాం జట్టు

సంక్రాంతి సందర్భంగా ప్రకాశం జిల్లాలో నాలుగు రోజులుగా జరుగుతున్న కబడి పోటీలు ముగిశాయి. రసవత్తరంగా సాగిన ఫైనల్ పోటీలో చినగంజాం, దర్శి జట్టులు తలపడ్డాయి. ఈ పోటీలను తిలకించడానికి పెద్ద ఎత్తున అభిమానులు క్రీడా ప్రాంగణానికి వచ్చారు.

By

Published : Jan 13, 2021, 3:31 PM IST

Published : Jan 13, 2021, 3:31 PM IST

ETV Bharat / state

దర్శి సంక్రాంతి సంబరాలు 'కబడి పోటీల్లో' సత్తా చాటిన చినగంజాం జట్టు

kabaddi
కబడి పోటీలు

సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రకాశంలోని దర్శిలో నిర్వహించిన కబడి పోటీల్లో చినగంజాం జట్టు విజేతగా నిలిచింది. తర్వాతి స్థానంలో దర్శి, వినోదరాయునిపాలెం, కురిచేడు జట్లు నిలిచాయి. స్థానిక ఎమ్మెల్యే సోదరుడు మద్దిశెట్టి. శ్రీధర్ విజేతలకు బహుమతులు అందజేశారు.

నాలుగు రోజులు నుంచి జరుగుతున్న పోటీల్లో... జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 48 జట్లు పాల్గొన్నాయి. ప్రథమ స్థానంలో నిలిచిన చినగంజాం జట్టుకు రూ. 30,000, ద్వితీయస్థానంలో నిలిచిన దర్శి జట్టుకు రూ.20,000... తరువాతి స్థానాల్లో నిలిచిన వినోదరాయుని పాలెం,కురిచేడు జట్లకు రూ.15000, రూ. 10116లు చొప్పున బహుమతి ప్రదానం చేశారు.

ఇదీ చదవండి:'లక్ష'ణంగా పిడకలతో భోగి మంట

ABOUT THE AUTHOR

...view details