ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఊపందుకున్న పురపోరు ప్రచారం.. గడపగడపకూ తిరుగుతూ ఓట్ల అభ్యర్థన - prakasham district latestnews

మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. అద్దంకి 19వ వార్డులో వైకాపా అభ్యర్థి నాగరాజును గెలిపించాలని.. నియోజకవర్గ ఇంచార్జీ బాచిన కృష్ణచైతన్య, మాజీ శాసనసభ్యులు బాచిన చెంచు గరటయ్య ప్రచారంలో పాల్గొన్నారు.

House-to-house candidate hunting for votes in a campaign
పురపోరు ప్రచారంలో గడపగడపకూ తిరుగుతూ అభ్యర్థుల ఓట్ల వేట

By

Published : Mar 3, 2021, 12:18 PM IST

పురపోరు సమీపిస్తున్న వేళ.. అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ వైకాపా ఇంచార్జీ బాచిన కృష్ణచైతన్య, మాజీ శాసనసభ్యులు బాచిన చెంచు గరటయ్య పాల్గొని.. గడపగడపకూ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

19 వార్డులో వైకాపా అభ్యర్థి నాగరాజును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలో కౌన్సిలర్​గా పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు, నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details