ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమ ఇసుక తరలింపు..పట్టుకున్న అధికారులు - illegal sand

ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ నదిలో అక్రమంగా ఇసుక తవ్వి, రవాణా చేస్తున్న వాహనాలను అధికారులు పట్టుకున్నారు. 7 ట్రాక్టర్లను సీజ్ చేసి, డ్రైవర్లను అరెస్ట్ చేశారు.

praksam district
అక్రమ ఇసుక తరలింపు.. పట్టుకున్న పోలీసులు

By

Published : May 23, 2020, 9:50 PM IST

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుండ్లకమ్మ నదిలో అక్రమంగా ఇసుక తవ్వి, రవాణా చేస్తున్న వాహనాలను ప్రత్యేక దళం అధికారులు అడ్డుకున్నారు. రెండు దఫాలుగా 7 ట్రాక్టర్లను సీజ్ చేసి, డ్రైవర్లను అరెస్ట్ చేశారు.

చేరుకుంపాడు సమీపంలో గుండ్లకమ్మ నదిలో పెద్దస్థాయిలో అనధికారికంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడనుంచి ఒంగోలుకు నిత్యం రవాణా చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ఎన్​ఫోర్స్​మెంట్​ ప్రత్యేక దళ జిల్లా అధికారి శ్రీనివాస చౌదరి, సీఐ తిరుపతయ్య ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని తాలూకా పోలీసులకు అప్పగించారు.

ఇది చదవండి రంజాన్: ముస్లింలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎంపీ

ABOUT THE AUTHOR

...view details