'ఒంగోలులో అవినీతి జరిగిందంటే బాధ్యత వహిస్తాను' - janardhan
ఒంగోలులో గత పరిపాలనలో అవినీతి జరిగిందంటే తాను బాధ్యత తీసుకుంటున్నానని జిల్లా తెదేపా అధ్యక్షుడు , జనార్ధన్ తెలిపారు. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి అభినందనలు తెలిపారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో ఏదైనా అవినీతి ఇప్పటి వరకు జరిగిందంటే తాను బాధ్యత వహిస్తానని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జనార్ధన్ అన్నారు. ఒంగోలు నియోజకవర్గం ఓటమిని స్వీకరిస్తున్నానని తెలిపారు. తాగునీటి అవసరాల కోసం తన బాధ్యతగా చేపట్టిన పైప్ లైన్ నూతన ఎమ్మెల్యే పూర్తి చేసి ఒంగోలు నగర వాసులకు మంచి నీటి కష్టాలు తీర్చాలని కోరారు. నూతన ఎమ్మెల్యేగా ఎన్నికైన బాలినేని శ్రీనివాస్ రెడ్డికి అభినందనలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది కలిగిన తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఒంగోలు నగరాన్ని గతంలో ఏ నాయకుడు చేయనంత అభివృద్ధి చేశానని... కానీ ప్రజల తీర్పును గౌరవిస్తున్నానని వివరించారు.