ప్రకాశం జిల్లావ్యాప్తంగానూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒంగోలులో అర్థరాత్రి నుంచి వానపడుతోంది. రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అద్దంకి బస్టాండ్, మంగమూరు రోడ్డు కూడలి, బాపూజీ కాంప్లెక్స్ ,పోతురాజు కాలువ, కేశవరాజు కుంట ప్రాంతాలు నీట మునిగాయి. చీరాల, వేటపాలెం, చినగంజాం, ఇంకొల్లు, పర్చూరు, మార్టూర్ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చీరాలలో రహదారులు జలమయమయ్యాయి. కందుకూరు కొండ ,ముడుసు పాలెం గ్రామాల మధ్య ఎర్ర వాగు ఉప్పొంగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
heavy rains: ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు...ప్రజలకు తప్పని ఇబ్బందులు - ప్రకాశం జిల్లా తాజా వార్తలు
ప్రకాశం జిల్లావ్యాప్తంగానూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒంగోలులో అర్థరాత్రి నుంచి వానపడుతోంది. చీరాల, వేటపాలెం, చినగంజాం, ఇంకొల్లు, పర్చూరు, మార్టూర్ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు