ప్రకాశం జిల్లాలోని 8 డిపోల పరిధిలో సుమారు 780 బస్సు సర్వీసులు సేవలందిస్తున్నాయి. జిల్లా నుంచి చెన్నై, బెంగళూరు వంటి నగరాలకూ బస్సులు నడుస్తున్నాయి. హైదరాబాద్కు ప్రతి డిపో నుంచీ బస్సులు ఉన్నాయి. కరోనా కారణంగా ప్రయాణికులు లేకపోవడంతో.. కొన్ని సర్వీసులను రద్దుచేసుకోవలసి వస్తోంది. ఒంగోలు నుంచి హైదరాబాద్కు 12 సర్వీసులు ఉండగా... ప్రస్తుతం వాటి సంఖ్య సగానికి తగ్గింది.
తగ్గిన రోజూవారీ ఆదాయం...
2019 - 20 సంవత్సరంలో 11.14 కోట్ల కిలోమీటర్లు తిరిగిన బస్సులు 2020 - 21 సంవత్సరంలో కేవలం ఐదుకోట్ల కిలోమీటర్లు మాత్రమే తిరిగాయి. ఆదాయం కూడా అప్పట్లో రూ.346 కోట్లు రాగా, ప్రస్తుతం కేవలం రూ.156 కోట్లు మాత్రమే వచ్చింది. బస్సుల్లో సీట్ల మధ్య దూరం పాటించడం వల్ల కొంత ఆక్యూపెన్సీ తగ్గింది. నెల రోజులుగా కొన్ని రూట్లలో బస్సులు ప్రయాణికులు లేకుండానే వెళ్తున్నాయి. ఫలితంగా రోజువారీ ఆదాయం కూడా బాగా తగ్గింది.