ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ట్యాంకర్ల నీరే ఆధారం... పది రోజులకోసారి సరఫరా!

జిల్లా పేరులో 'ప్రకాశం' ఉంది కానీ అక్కడి ప్రజల జీవితాల్లో మాత్రం అది కనిపించదు.  తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ఫ్లోరిన్ పెనుభూతంతో సతమయ్యే జిల్లా వాసులను... వేసవిలో  మరిన్ని కష్టాలు వెంటాడుతున్నాయి.  తాగేందుకు నీరు లభించక.. ఉన్న అరకొర నీటినే రోజులతరబడి దాచుకుని వాడుకుంటున్నారు.

పీపాల్లో నీటిని భద్రపరచుకున్న ప్రజలు

By

Published : May 8, 2019, 9:04 PM IST

నీరు లేక ప్రకాశించేదెలా?
పశ్చిమ ప్రకాశంలో తీవ్ర తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగింటిపోయాయి. పశ్చిమ ప్రకాశానికి ప్రారంభంలో ఉన్న పొదిలి మండలంలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గ్రామీణ ప్రాంత ప్రజలు తాగు, ఇతర అవసరాలకు నీటిని అందించడంలో అధికారులు విఫలమవతున్నారు. పొదిలి మండలంలో తలమళ్ళ, గోగినేనివారి పాలెం, ఏలూరు పంచాయితీలు రామతీర్ధం జలాశయానికి సమీపంలో ఉన్న పంచాయితీ గ్రామాలు... సుమారు 7వేల మంది ప్రజలు జీవిస్తున్నారు.

రామతీర్ధం జలాశయంనుంచి మర్రిపాడు రక్షిత మంచినీటి పథకానికి గొట్టాలు ద్వారా నీటిని సరఫరా చేస్తారు.. ఈ పైపు లైన్‌ ఈ గ్రామాల మధ్య నుంచే వెళతాయి... కానీ ఈ గ్రామాలకు రక్షిత మంచినీటి సరఫరా మాత్రంలేదు. సాగర్‌ నుంచి వారానికో, 10 రోజులకో ఒక సారి నీటిని సరఫరా చేస్తారు. అదీ అరకొర మాత్రమే... ఆ నీటినే జాగ్రత్తగా భద్రపరచుకొని ప్రజలు తాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నారు.

ట్యాంకర్ల నీరే దిక్కు

గ్రామాల్లో రక్షిత మంచినీటి సరఫరా కోసం ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు నిర్మించారు. కానీ ఈ ట్యాంకులకు నీటి సరఫరా చేయడం గానీ, విద్యుత్తు కనెక్షన్లు లేక ఆరేళ్లుగా వృథాగా పడి ఉన్నాయి. గ్రామాల్లోని గొట్టపు బావులు, డీప్‌ బోర్లు ఇంకిపోయాయి. పొలాల్లో ఉన్న బోర్ల నీటిని ట్యాంకర్ల ద్వారా పంచాయితీ సరఫరా చేస్తున్నప్పటికీ... అక్కడ కూడా నీరు ఇంకిపోయి నీటి సరఫరా అరకొరగా ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామాలకు శాశ్వత పరిష్కారంగా సాగర్‌ నుంచి ప్రత్యేక పైపు లైన్‌ వేయడం గానీ, రామతీర్థం జలాశయం నుంచి నీటిని మళ్లించడం గానీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details