ప్రకాశం జిల్లా చీరాల వేటపాలెంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద గ్రామ వాలంటీర్ అభ్యర్థులు ఆందోళన చేశారు. మంగళవారం ప్రకటించిన జాబితాలో పేర్లు ఉన్నాయని అధికారులు చెప్పారని, ఇవాళ శిక్షణకు హాజరుకావాలని తమ చరవాణికి కూడా సమాచారం వచ్చిందని... కానీ ఇక్కడున్న జాబితాలో మాత్రం తమ పేర్లు లేవని అభ్యర్థులు వాపోయారు. నిరుద్యోగులమైన తమను ఆశపెట్టి మొసం చేశారంటూ ఆందోళన నిర్వహించారు. సీ.ఐ నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు అక్కడకు చేరుకుని, పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
వేటపాలెంలో గ్రామ వాలంటీర్ అభ్యర్థుల ఆందోళన - chirala
ప్రకాశం జిల్లాలో గ్రామ వాలంటీర్ అభ్యర్థులు ఆందోళన చేశారు. లిస్టులు తమ పేర్లు లేకపోవడాన్ని నిరసిస్తూ ధర్నాకు దిగారు.
ఆందోళన చేస్తున్న గ్రామవాలంటీర్ అభ్యర్థులు