ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిరుపయోగంగా పడి ఉన్న చెత్త సేకరించే ఆటోలు

ప్రకాశం జిల్లా మద్దిపాడులో ఏర్పాటు చేసిన చెత్త నుంచి సంపద కేంద్రానికి ఉపయోగించే ఆటోలు.. నిరుపయోగమయ్యాయి. పూర్తిగా చెడిపోయేదశకు చేరుకున్నాయి.

praksam district
నిరుపయోగంగా ఉన్న చెత్త సేకరించే ఆటోలు

By

Published : Jun 30, 2020, 12:43 AM IST

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో 21 పంచాయతీల్లో చెత్త నుంచి సంపద కేంద్రాలు 15 ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఎన్నికలకు ముందు మండలంలో ప్రతి గ్రామానికి చెత్తను సేకరించేందుకు ఒక ఆటోను కేటాయించారు. కానీ వాటిని ఉపయోగించకుండా అలానే వదిలేశారు. ఆ వాహనాలకు కేటాయించిన లబ్ధిదారులను రికార్డుల్లో చూపించారే కానీ వారికి అవి అందని కారణంగా.. పూర్తిగా పాడైపోయాయి.

లబ్ధిదారులు వాటిని అప్పగించాలని కోరినా.. ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేవని అధికారులు మాట దాటేస్తున్నారు. ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేస్తున్నారని కొందరు ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా.. ఎవరూ పట్టించుకోవటం లేదు. ఎప్పటికైనా అధికారులు స్పందించి వ్యర్ధాల నుంచి సంపద కేంద్రాలకు ఉద్దేశించిన ఈ ఆటోలను త్వరితగతిన లబ్ధిదారులకు అందించాలని గ్రామస్ధులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details