పొలాల వద్ద రైతులు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ మోటార్లను దొంగిలిస్తున్న ముఠాను ప్రకాశం జిల్లా చీరాల పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 5.40 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పర్చూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మోటార్లు, విద్యుత్ పరివర్తకంలోని తీగలు నిత్యం దొంగిలించబడుతున్నాయని వాటిపై నిఘాపెట్టామన్నారు. ఈ మేరకు ఏడుగురు నిందితులును అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.
విద్యుత్ మోటార్ల అపహరణ..ముఠా అరెస్టు - arrested
విద్యుత్ మోటార్లను అపహరిస్తున్న ముఠాను ప్రకాశం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 5.40 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
ముఠా అరెస్టు