ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'హెచ్చరిక.. కాలువలో మొసళ్లు తిరుగుతున్నాయ్.. లోనికి దిగకండి' - prakasam updates

నాగార్జున సాగర్ దర్శి బ్రాంచి కాలువలో 4 మొసళ్లు తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే సాగర్ కాలువలోని పలు ప్రాంతాల్లో మొసళ్లు కనిపించాయి. అధికారులు హెచ్చరిక బోర్డులను కెనాల్ సరిహద్దుల్లో ఏర్పాటు చేశారు.

నాగార్జున సాగర్  కాలువలో నాలుగు మొసళ్లు సంచారం
Four crocodiles are roaming in the Nagarjuna Sagar

By

Published : Nov 25, 2020, 2:17 PM IST

Updated : Nov 25, 2020, 3:19 PM IST

ప్రకాశం జిల్లా దర్శిలోని నాగార్జున సాగర్ బ్రాంచి కాలువలో 4 మొసళ్లు తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఓ సారి కురిచేడు మండలం బయ్యారం వద్ద ఓ రైతుకు మొసలి కనిపించగా.. స్థానికులు ఆందోళన చెందారు. ఆ తర్వాత కూడా సాగర్ కాలువలో పలు ప్రాంతాల్లో స్థానికులకు మొసళ్లు కనిపించాయి. ఈ వివరాలపై ఆరా తీసిన అటవీ శాఖ అధికారులు 4 మొసళ్లు సంచరిస్తున్నట్లు తేల్చారు. కాలువపై హెచ్చరిక బోర్డులును ఏర్పాటు చేశారు.

దర్శి, కురిచేడు మండలాల ప్రజలు కాలువలోకి దిగరాదని అటవీ శాఖాధికారి తులసీరావు తెలిపారు. అయ్యప్ప, భవాని, శివ, వెంకటేశ్వర మాలలు ధరించిన భక్తులు కాలువలో స్నానాలు చేయరాదని దండోరా వేయించారు. గొర్ల కాపరులు, గేదెల కాపరులు సైతం సాగర్ కాలువలో దిగరాదని, వ్యవసాయ కూలీలు కూడా... కాలువలో ఎటువంటి కార్యకలాపాలు చేయకూడదని హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు తులసీరావు తెలిపారు.

Last Updated : Nov 25, 2020, 3:19 PM IST

ABOUT THE AUTHOR

...view details