ప్రకాశం జిల్లా చీరాల మండలం ఓడరేవు గ్రామంలో మత్స్యశాఖ, పోలీస్ అధికారుల సమక్షంలో మత్స్యకారుల పడవలను తిరిగి సముద్రపు వేటకు అనుమతించారు. ఐలా, బల్ల వలలు లేకుండా మత్స్యకారులను సాధారణ సముద్రపు వేటకు అనుమతించామని మత్స్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఐలా, బల్ల వలల విషయంలో వాడరేవు, కటారివారిపాలెం.. మత్స్యకారుల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో అధికారులు రెండు గ్రామాల మత్స్యకారులతో అధికారులు పలుసార్లు చర్చలు జరపడం వల్ల ఇరు వర్గాల మధ్య వివాదం సద్దుమణిగింది. దీంతో జాలర్లకు సాధారణ వేటకు అనుమతించారు. దాదాపు నెల రోజుల నుంచి సముద్రపు వేటకు దూరంగా ఉన్నందున పడవలు ఇసుకలో కూరుకుపోయాయి. వాటిని ట్రాక్టర్ల సహాయంతో బయటకు తీశారు.