private travels bus burnt in prakasam: పశ్చిమగోదావరి జిల్లాలో జలవిషాదం మరవకముందే..ఇవాళ వేకువజామున మరో బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా చీరాల వస్తున్న ప్రైవేటు బస్సులో ప్రయాణికులు నిద్రిస్తుండగానే మంటలు చెలరేగాయి. బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఆ సయమంలో మెలకువలో ఉన్నవారి అరుపులతో బస్సు నుంచి బయటకు దూకి అందరూ ప్రాణాలు కాపాడుకున్నారు.
Bus fire in prakasam: ప్రకాశం జిల్లాలో ప్రైవేటు బస్సు దగ్ధం.. ప్రయాణికులు సురక్షితం - bus fire in prakasam
06:05 December 16
private travels bus burnt in prakasam: మంటల్లో దగ్ధమైన ప్రయాణికుల సామాగ్రి
Bus fire in prakasam district: ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం దగ్గర ప్రైవేటు బస్సు మంటల్లో దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి చీరాల వస్తున్న బస్సులో.. వేకువజామున మంటలు చెలరేగాయి. ఘటన సమయంలో మెలకువలో ఉన్నవారు, బస్సు డ్రైవరు కేకలతో నిద్రలోనే ఉన్నవారు బయటకు దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. ప్రయాణికుల సామగ్రి మాత్రం పూర్తిగా మంటల్లో కాలిపోయింది. బస్సు మరో గంటలో చీరాల చేరుకోవాల్సిన సమయంలో మంటలు చెలరేగాయి. ప్రాణ నష్టం లేకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
bus burnt in prakasam district: ఇంజిన్ లో లోపమా లేక ఏసీలో విద్యుదాఘాతం వల్ల మంటలు చెలరేగాయా అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. బస్సులో కనీసం ఫైర్ ఎవాక్యువేషన్ లేదని.. ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామగ్రి మొత్తం బుగ్గిపాలు అయిందని తెలిపారు.
ఇదీ చదవండి..
Bus Accident: జల్లేరులో జల విషాదం..వాగులో పడిన ఆర్టీసీ బస్సు..10 మంది మృతి