ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుండ్లకమ్మకు జళకళ..ప్రకాశం రైతులకు పంట కళ

సాగు కాదుకదా.. తాగు నీటికి కూడా ఇబ్బంది పడుుతన్న తరుణంలో ప్రస్తుతం కురుస్తోన్న వర్షాలతో రైతులు ఆనందపడుతున్నారు. ప్రకాశం జిల్లా గత ఐదేళ్లుగా వర్షాలు లేక ఎండిపోయిన గుండ్లకమ్మ జలాశయం ఇప్పుడు జళకళతో అలరారుతుంది. రైతులకు ఖరీఫ్​లో నీరందించేందుకు జలాశయం సిబ్బంది నీరు విడుదల చేయటంతో ప్రస్తుతం పంటలు సాగుచేసేందుకు రైతులు ఆశాజనకంగా పనులను ప్రారంభించారు.

గుండ్లకమ్మకు జళకళ..ప్రకాశం రైతులకు పంట కళ

By

Published : Sep 27, 2019, 1:34 PM IST

వర్షాలతో ప్రకాశం జిల్లాలో పంట కళ

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని గుండ్లకమ్మ జలాశయం నుంచి ఖరీఫ్ సాగుకు అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ మేరకు రైతులు పంటలు వేసుకునేందుకు ఆశక్తి చూపుతున్నారు. ఎంతో కాలంగా వర్షాలు లేక సరైన పంటలు వేయక రైతులు తీవ్రంగా నష్టపోయారు. గత నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి నీరు గుండ్లకమ్మ జలాశాయానికి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలో రెండు టీఎంసీల నీరు నిల్వ ఉండటంతో పంటలు సాగు చేసుకునేందుకు వీలుపడుతుందని అధికారులు రైతుల కోసం నీరు విడుదల చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా 80 వేల ఎకరాల్లో పంటలు పండించేందుకు రైతులు ముందుకొచ్చారు. వరితో పాటు పత్తి, మిరప, బంతి, పొగాకు లాంటి వాణిజ్య పంటలను పండించేందుకు పనులను ప్రారంభించారు.

గుండ్లకమ్మ జలాశయం 3.75 టీఎంసీల సామర్థ్యంతో ఏర్పాటు చేయగా.. ప్రస్తుతం 1.93 టీఎంసీల నీరు ఉంది. మిగిలిన నీటిని సాగర్ జలాలతో కలపాలని కలెక్టర్ పోలా భాస్కర్ స్థానిక ఎమ్మెల్యే పీజేఆర్ సుధాకర్ బాబు ప్రతిపాదన చేశారు. ఇప్పటికే పరిసర ప్రాంతాల్లో చెరువులు నిడటంతో త్వరలోనే 1.5 టీఎంసీల నీరు జలాశయానికి విడుదల చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. పొంగుతున్న గుండ్లకమ్మ జలాశాయాన్ని చూసి రానున్న కాలంలో తాగు, సాగు నీటికి ఎక్కడ ఇబ్బందులు ఉండవని రైతులు,స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details