మాములు పంటలతో పాటు చిరుధాన్యాలను పండిస్తే అదనంగా లాభాలు పొందవచ్చని హైదరాబాద్లోని భారతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ శాస్త్రవేత్త వి.సుబ్బారాయుడు అన్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో చిరుధాన్యాల సాగు పై రైతు సదస్సు జరిగింది. తృణధాన్యాల సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నాయని, ఎటువంటి పంటలు సాగుచేసినా.. అంతర్ పంటలుగా పండించవచ్చన్నారు. పరిపూర్ణమైన ఆరోగ్యం కోసం వైద్యులు చిరుధాన్యాలను వినియోగించమని సూచిస్తున్నట్టు తెలిపారు. వీటి సాగువిధానం గురించి రైతులకు అవగాహన కల్పించారు.
చిరుధాన్యాలు పండిస్తే... లాభాలు మీవెంటే... - iimr
ప్రకాశం జిల్లా చీరాలలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో చిరుధాన్యాల సాగు.. వినియోగంపై రైతు సదస్సు నిర్వహించారు.
రైతు సదస్సు