ప్రకాశం జిల్లా ఒంగోలులో లాక్ డౌన్ లో రంజాన్ పండుగ జరుపుకుంటున్న ముస్లిం కుటుంబాలకు... ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ పోలా భాస్కర్ ప్రారంభించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి సొంత నిధులతో నిత్యావసర సరకులను ప్యాకెట్లుగా చేయించి, ఇస్లాంపేట, కబేళాబజార్, కరుణాకాలనీ, పాపాకాలనీ, ఏకలవ్య నగర్, రిక్షాబజార్, బిలాల్ నగర్ ప్రాంతానికి చెందిన 3500 కుటుంబాలకు పంపిణీ చేశారు.
రంజాన్: ముస్లింలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎంపీ
ప్రకాశం జిల్లా ఒంగోలులో రంజాన్ పండుగను పురస్కరించుకుని... ఎంపీ ముస్లిం కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ పోలా భాస్కర్ ప్రారంభించారు. దాదాపు 3500 కుటుంబాలకు సరకులు అందజేశారు.
ముస్లింలకు ఎంపీ రంజాన్ సాయం
కంటైన్మెంట్ జోన్ గా ఉండటం వల్ల ముస్లింలు బయటకు వెళ్లలేక, ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారని, పండగ పూట ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో ఈ వితరణ చేపట్టినట్లు ఎంపీ తెలిపారు. బియ్యం, పప్పుదినుసులు, గోధుమ పిండి, నెయ్యి, కాయగూరలు వంటివి ప్యాక్ చేసి పంపిణీ చేశారు.
ఇది చదవండి చీరాలలో ఎక్సైజ్ పోలీసుల దాడులు