దర్శి నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్నీ సిద్ధం చేశారు. నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు సామగ్రిని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. విధులు నిర్వర్తించేందుకు ఉద్యోగులు తరలివచ్చారు. చిన్నపిల్లలున్న మహిళా ఉద్యోగులు వారితో పాటు తమ తల్లులను వెంటబెట్టుకుని వచ్చారు. సాయంత్రంలోగా అన్ని కేంద్రాలకు సిబ్బందిని, యంత్రాలను తరలిస్తామని అధికారులు తెలిపారు.
మార్కాపురంలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. స్థానిక ఎస్వీకేపీ కళాశాలలో జరుగుతున్న ఏర్పాట్లను రిటర్నింగ్ అధికారి రామకృష్ణారెడ్డి పర్యవేక్షిస్తున్నారు. అక్కడినుంచి ఈవీఎంలను, సిబ్బందిని నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. రక్షణగా పోలీసు బలగాలూ వారితో బయలుదేరాయి.