ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దర్శిలో అటకెక్కిన పారిశ్రామికవాడ అభివృద్ధి.. అమ్మకానికి ప్లాట్లు - darsi in prakasam district

INDUSTRIES : పరిశ్రమలు స్థాపించాలంటే అందుకు అనువుగా భూమి, వసతులు ఉండాలి. అప్పుడే ప్రభుత్వాలు ప్రతిపాదిత ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించే అభివృద్ధి పనులు చేపడతాయి. ప్రకాశం జిల్లాలో ఓ పారిశ్రామికవాడ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. పేపరుకే పరిమితమైన ఈ పారిశ్రామిక వాడలోని ప్లాట్లను అధికారులు విక్రయానికి పెట్టడం విమర్శల పాలవుతోంది.

INDUSTRIES
INDUSTRIES

By

Published : Sep 19, 2022, 3:58 PM IST

దర్శిలో అటకెక్కిన పారిశ్రామికవాడ అభివృద్ధి.. ప్లాట్లు అమ్మకానికి అధికారులు

Industrial Area In Darsi : ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని చందలూరు కొండ ప్రాంతంలో గత ప్రభుత్వ హయాంలో పారిశ్రామికవాడ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో అధికారం మారడంతో పనులు అటకెక్కాయి. మౌలిక సదుపాయాలు కల్పించి భూమిని ప్లాట్లుగా ఏర్పాటు చేయాల్సిన అధికారులు ఆ మాట ఎత్తలేదు.

ప్రస్తుతం 60 ఎకరాల్లో 113 ప్లాట్లు సిద్ధంగా ఉన్నట్టు ప్రణాళిక మ్యాపు, ప్రకటనలతో ఆన్​లైన్​లో పెట్టారు. దరఖాస్తు చేసుకోవడానికి వచ్చినవారు భూమిని పరిశీలించి అవాక్కయ్యారు. ఎలాంటి మౌలిక వసతులు కల్పించకపోగా.. కొండ ప్రాంతానికి వెళ్లడానికి రోడ్డు కూడా లేకపోవడంతో వారు ఆశ్చర్యపోయారు.

దర్శికి 11కిలోమీటర్లు, అమరావతికి 150 కిలోమీటర్లు, హైదరాబాద్‌కు 250కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో పారిశ్రామికవాడ ఏర్పడితే కంపెనీల ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్థానిక ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఏళ్లు గడుస్తున్నా పనులు పూర్తి చేయకపోవడంతో స్థానికులు ఆవేదన చెందుతున్నారు. పారిశ్రామికవాడ ఏర్పాటు చేసి పరిశ్రమలు వచ్చేట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details