ప్రకాశం జిల్లా అద్దంకి నగర పంచాయతీలో ఉపాధ్యక్ష పదవికి గిరాకీ పెరిగింది. ఇక్కడ మొత్తం ఇరవై వార్డులున్నాయి. అధ్యక్ష పదవి ఎస్సీ మహిళకు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యక్ష పదవి కీలకమని భావించి ఓ సామాజిక వర్గం నాయకులు కన్నేశారు. ఎలాగైనా పదవిని దక్కించుకునేందుకు ఆ వర్గానికి చెందిన వారు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో తనకు పార్టీ ‘బీ’ ఫారం ఇచ్చి... వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యాక ఉపాధ్యక్ష పదవిని కట్టబెట్టాలని ఓ నాయకుడు బేరసారాలకు దిగారు. ప్రతిఫలంగా పార్టీకి రూ.1.20 కోట్ల విరాళం ఇస్తానని ప్రకటించారు. ఈ పరిణామంతో మిగిలిన ఆశావహులు మిన్నకుండి పోయారు.
ఉపాధ్యక్షుడిని చేస్తే.. రూ.1.20 కోట్లిస్తా! - అద్దంకి నగర పంచాయతీ ఎన్నికలు 2020
అద్దంకి నగర పంచాయతీలో ఉపాధ్యక్ష పదవికి గిరాకీ చూస్తే ఎవరికైనా దిమ్మితిరిగిపోతుంది. ఆ పదవిని సాధించడానికి ఓ నాయకుడు ఏకంగా కోటి చెల్లించేందుకు సిద్ధమయ్యారు. దీనివల్ల ఆ స్థానాన్ని ఆశించిన మిగతా అభ్యర్థులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
addanki vice president