ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం వెల్లంపల్లిలోని రాఘవేంద్ర వైన్స్ వద్ద గుర్తు తెలియని మృతదేహం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మృతుడు పల్లెటూరి నాగేశ్వరరావుగా గుర్తించారు. స్థానికంగా ఉన్న స్పిన్నింగ్ మిల్లులో పని చేస్తున్నట్టు సమాచారం. ఒడిశాకు చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకుని ఇక్కడ జీవనం సాగిస్తున్నాడని.. ఇతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసులు తెలిపారు.
గుర్తు తెలియని మృతదేహం కేసును ఛేదించిన పోలీసులు - case
వెల్లంపల్లిల్లో గుర్తు తెలియని మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. మృతుడు పల్లెటూరి నాగేశ్వరరావుగా గుర్తించారు.
వైన్స్ పక్కనే మృతదేహం కేసు ఛేదించారు